జియాగూడ, మే 17: బషీర్‌బాగ్‌లోని నిజాం కాలేజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ జీవితాలతో కాలేజీ ప్రిన్సిపాల్ చెలగాటం ఆడుతున్నారని శనివారం కాలేజీ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎగ్జామ్స్ ఫీజు కట్టించుకొని ఇప్పుడు 75 శాతం అటెండెన్స్ లేదని హాల్ టికెట్స్ ఇవ్వడం లేదని డీగ్రీ సెకండ్, థర్డ్ ఇయర్‌కు చెందిన 350 మంది విద్యార్థులు ధర్నాకు దిగారు. ప్రిన్సిపాల్ రూమ్‌కు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు.
శనివారం జరిగే 6వ సెమిస్టర్ ఎగ్జామ్‌ను బహిష్కరించి తోటి విద్యార్థులు, అందరికి హాల్‌టికెట్స్ ఇస్తేనే ఎగ్జామ్ రాస్తామంటూ రోడ్డుపై బైఠాయించారు. ఓ విద్యార్థి మాట్లాడుతూ.. పరీక్షకు వారం ముందు హాల్ టికెట్ ఇవ్వాలి.. కానీ ఒకరోజు ముందు శక్రవారం (16వ తేదీ) ఉదయం 11 గంటలకు హాల్ టికెట్లు అందజేశారని అన్నారు. మొత్తం 560 మంది విద్యార్థలలో 350 మంది విద్యార్థలకు హల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. ప్రిన్సిపాల్‌ను అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. హాల్ టికెట్లు ఇవ్వకుంటే సెమిస్టర్ బైకాట్ చేసి ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. చివరకు పోలీసుల జ్యోకంతో విద్యార్థులు శాంతించారు.