Nizam College | సుల్తాన్ బజార్, ఫిబ్రవరి 14 : దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిజాం కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఏవి రాజశేఖర్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం కళాశాల ఆవరణలో ఎన్సీసీ ఆధ్వర్యంలో 2019 ఫిబ్రవరి 14 ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వీర సైనికులకు ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్ నేషనల్ హైవే పైన సైనికుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి చేయడంతో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారని గుర్తు చేశారు. ఈ దాడి జరిగి ఐదేళ్లు పూర్తయిందని అన్నారు. దేశ రక్షణ కోసం, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం సైనికుల వీరత్వానికి నాంది పలుకుతుందన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్, ఎన్సీసీ ఆఫీసర్ నవీన్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, ఎన్సీసీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.