NIFD | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ (NIFD) హైదరాబాద్ ఆధ్వర్యంలో నాగోల్ శివం కన్వెన్షన్‌లో ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్సులు పూర్తయిన నేపథ్యంలో గ్రాడ్యుకేషన్ డేని ఘనంగా నిర్వహించారు. తొలుత NIFD విద్యార్థులు నేర్చుకున్న అనేకమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నూతన డిజైన్లన ఫ్యాషన్ షోలో ప్రదర్శించగా.. వాటిని ధరించి మోడల్స్ ర్యాంప్‌పై వాక్ చేశారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కసం వెంకటేశ్వర్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్, గ్లోరియస్ మిస్ ఇండియా 2025 పూజ పటేల్, మిస్ ఇండియా రన్నర్ ఆఫ్ సిమ్రాన్ పారిక్ వంటి సెలబ్రిటీలు పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఫ్యాషన్ షో అనంతరం విద్యాసంస్థలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించగా.. ముఖ్యఅతిథిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి శ్రీకృష్ణ యాదవ్, రాష్ట్ర నాయకులు ఏనుగు సుదర్శన్ చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో చైర్మన్ కన్నె బోయిన గీతా రామ్ యాదవ్, హైదరాబాద్ స్కూల్ ఆఫ్ డ్యూటీ డైరెక్టర్ క్రాంతి , కల రాజ్ మీడియా సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్, సెటిలైట్ అధినేత నర్సింగరావు, బీజేపీ రాష్ట్ర నేతలు సామల పవన్ రెడ్డి, ప్రవీణ్, అనిత రెడ్డి, బీజేవైఎం అధ్యక్షుడు బండారు పవన్ రెడ్డి, డిజైనర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
Fashion Show
Fashion Show
Fashion Show
Fashion Show
Fashion Show
Fashion Show
Fashion Show
Fashion Show
Fashion Show