హైదరాబాద్ : బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. తాజాగా పోక్సో కేసులో బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలంటూ హైదరాబాద్ నెక్లెస్ ప్లాజా వద్ద విద్యార్థులు, సంఘ సంస్కర్తలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఆందోళన చేపట్టారు.
బాలికకు అన్యాయం జరిగిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి స్పందించకపోవడం దారుణమన్నారు. బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేసి దర్యాప్తుకు సహకరించాలని డిమాండ్ చేశారు.