సికింద్రాబాద్, ఏప్రిల్ 27: ఉస్మానియా యూనివర్సిటీలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయ త్నం చేయడం క్యాంపస్‌లో తీవ్ర కలకలం రేపింది. ఓయూలో మైనింగ్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న మహబూబాబాద్‌కు చెందిన విద్యార్థి వనీశ్ క్యాంపస్‌లోని లేడీస్ హా స్టల్ ఎదురుగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నా డు. రెప్పపాటు కాలంలో ఉవ్వెత్తున ఎగిసిన మంటలకు తాళలేక వనీశ్ ఆర్తనాదాలు చేశాడు. దీంతో అక్కడే ఉన్న విద్యార్థులు తీ వ్రంగా ప్రయత్నించి ఎట్టకేలకు మంటలను ఆర్పారు.
అప్పటికే తీవ్రంగా గాయపడిన వనీశ్ను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు. 70శాతం కాలిన గాయాలతో ఉన్న బాధితుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. వనీశ్ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను పోలీసులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. విచారణ జరుపుతున్నట్లు వివరించారు. ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా యి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.