సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): నూతన సంవత్సర వేడుకలను ఇన్సిడెంట్ ఫ్రీగా నిర్వహించుకోవాలని రాచకొండ సీపీ సుదీర్‌బాబు సూచించారు. ఔట్‌డోర్‌లో నిర్వహించే కార్యక్రమాలకు డీజేలకు అనుమతి ఉండదని సీపీ తెలిపారు. బుధవారం రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఆ యా జోన్ల డీసీపీలు, అదనపు డీసీపీలు ఇత ర సిబ్బందితో పాటు ఈవెంట్ అర్గనైజర్లు, పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, ఫామ్‌హౌస్, మద్యం దుకాణాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ బాధ్యయుతంగా పోలీసులకు సహకరించాలని కోరారు. వేడుకల్లో ప్రజలు, యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారని, అలాంటి సందర్భంగా శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఔట్‌డోర్ కార్యక్రమాలు జరిగే చోట డీజే బాక్సులకు అనుమతి లేదని, ఎటువంటి బాణసంచా కాల్చవద్దని సూచించారు. మహిళలపై ఎటువంటి వేధింపులు జరగకుండా నిరోధించడానికి షీ టీమ్స్ విధుల్లో ఉంటాయన్నారు.
డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడానికి తమ బృందాలు తనిఖీలు చేస్తాయని, నిషేధిత డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నామని కమిషనర్ అన్నారు. పబ్‌లు, బార్లు, వైన్ షాపులు నిర్ధేశిత సమయంలోపు మూసివేయాలని, మైనర్లకు మద్యం అమ్మే దుకాణాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిబంధనల మేరకు వేడుకలు నిర్వహించుకోవాలని, ట్రాఫి క్ సమస్యలు తలెత్తకుండా నిర్వాహకులు పా ర్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీపీలు ఆకాంక్ష్‌యాదవ్, నా రాయణరెడ్డి, అనురాధ, సీహెచ్ శ్రీధర్, రమణారెడ్డి, ఇందిర, నర్సింహారెడ్డి, ఉషారాణి, శ్రీ నివాస్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.