సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ): పనితో పాటు ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, త్వరలోనే సిబ్బందికి క్యాంటీన్ సౌకర్యంతో పాటు మెట్రో నుంచి షటిల్ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. సోమవారం టీఎస్ పీఐసీసీసీలో మినిస్టీరియల్ స్టాఫ్, ఐటీ సెల్, పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో కొత్త సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కేక్ కట్ చేశారు. ఈ సమావేశంలో అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ సీపీలు రమేశ్, విశ్వప్రసాద్, డీసీపీలు సునీతారెడ్డి, పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు శంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.