వ్యవసాయ యూనివర్సిటీ, మార్చి 5: టమాటకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉందని, వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలను మరిన్ని మార్కెట్లోకి తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డా. రాజిరెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఉద్యాన కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన నాణ్యత నిచ్చే నూతన టమాట రకాల రూపకల్పనపై అంతర్జాతీయ వర్క్‌షాప్‌కు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో వాతావరణ, పర్యావరణ మార్పులు, వైరస్ తెగుళ్లు,చీడపీడలను తట్టుకునే రకాలు, అధిక దిగుబడినిచ్చే, పరిశ్రమలకు అనుగుణంగా ఉండే ప్రాసెసింగ్ టమాట, హైబ్రిడ్ రకాలను రూపొందిస్తే ఎగుమతికి అవకాశాలు పెరుగుతాయన్నారు.
వైరస్‌ను తెగుళ్లను, అధిక వేడిని తట్టుకునేందుకు అవసరమైన, జన్యులను ఆవిష్కరించి, టమాట రకాలలో జొప్పించామని, వాటిని త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా రైతులకు అందుబాటులో తీసుకువస్తామని, తైవాన్ దేశంలో అంతర్జాతీయ కూరగాయల పరిశోధనా కేంద్రం టమాట బ్రీడింగ్ సీనియర్ శాస్తవ్రేత్త డా. అసఫ్ ఐబిసీజ్ అన్నారు. పరిశోధనా ఫలితాలు కాన్షరెన్స్ జనరల్ కార్యదర్శి, వర్సిటీ అసోసియేట్ ప్రొ. పిడిగం సైదయ్య, వర్సిటీ డీన్ డా. రాజశేఖర్, పరిశోధనా సంచాలకులు డా. లక్షీనారాయణ, అంత్జాతీయ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ డా. శ్రీనివాసన్ ఉద్యాన కళాశాల అసోషియేట్ డీన్ డా. పిప్రశాంత్, మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్, డా. పి.సైదయ్య, ప్రపంచ కూరగాయల కేంద్రం సైంటిఫిక్ అధికారి డా. వై. శ్రీనివాస్‌రెడ్డ్డి, యూనివ్సిటీ శాస్తవ్రేత్తలు, ప్రొఫెసర్లు,పరిశోధనా విద్యార్థులు పాల్గొన్నారు.