Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని నేరెడ్‌మెట్‌లో బుధవారం రాత్రి పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఓ బాడీ మసాజ్ సెంటర్‌పై దాడి చేయగా.. పోలీసులకు షాకింగ్ ఘటన ఎదురైంది. ఆ మసాజ్ సెంటర్లో మహిళలతో అసాంఘిక కార్యకలాపాలు చేయిస్తున్నట్లు తేలింది. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి పురుషులకు మసాజ్ చేయిస్తూ, వారితో బలవంతంగా చేయకూడని పనులను చేయించారు.
విశ్వసనీయ సమాచారంతోనే నేరెడ్మెట్ పోలీసులు డిఫెన్స్ కాలనీలోని ఈ మసాజ్ సెంటర్‌పై దాడి చేశారు. మసాజ్ సెంటర్ నిర్వాహకులైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారిని విచారించారు.