Nepali youth | ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేపాలీ యువకులకు స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన బషీర్ బాగ్ సీసీఎస్ కార్యాలయం సమీపంలో చోటు చేసుకోవడం గమనార్హం.
నేపాలీ యువకులు హైదరాబాద్లోని బషీర్ బాగ్ సీసీఎస్ కార్యాలయం ఎదురుగా ఒంటరిగా నడుస్తూ వెళ్తున్న ఓ యువతి చేయి పట్టి లాగి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆ యువతి కేకలు వేయడంతో అది విన్న స్థానికులు నేపాలీలను నిర్బంధించి దేహశుద్ధి చేశారు.
నేపాలీ యువకులు స్థానికంగా ఉండే ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పని చేస్తున్న సునీల్, ఉమేష్, లక్ష్మణ్, పురుషోత్తం, రామ్ నేవుపనేలుగా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసిన అబిడ్స్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేపాలీ యువకులకు దేహశుద్ధి చేసిన స్థానికులు
హైదరాబాద్ – బషీర్ బాగ్ సీసీఎస్ కార్యాలయం ఎదురుగా ఒంటరిగా నడుస్తూ వెళ్తున్న ఓ యువతి చేయి పట్టి లాగి, అసభ్యంగా ప్రవర్తించిన నేపాలీ యువకులు
యువతి కేకలు విని నేపాలీలను నిర్బంధించి దేహశుద్ధి చేసిన స్థానికులు… pic.twitter.com/5VluMChW0U
— Telugu Scribe (@TeluguScribe) May 28, 2026