Hyderabad | హైదరాబాద్ పరిధిలోని నార్సింగిలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం సృష్టించింది. శశివర్దన్ రెడ్డి అనే వ్యాపారవేత్తను అర్ధరాత్రి సమయంలో రాయలసీమకు చెందిన ఓ గ్యాంగ్ బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోయింది. ఇది తెలిసిన శశివర్దన్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన పోలీసులు సినీ ఫక్కీలో కిడ్నాపర్లను చేజ్ చేశారు. కర్నూలుకు వెళ్తుండగా మహబూబ్‌నగర్ జిల్లాలో కిడ్నాపర్లను నార్సింగ్ పోలీసులు పట్టుకున్నారు. శశివర్దన్ను క్షేమంగా రక్షించారు. కాగా, ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్‌నకు కారణమని పోలీసులు తెలిపారు.