బడంగ్‌పేట : మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందిహిల్స్ 9వ డివిజన్లో ఉన్న ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించినందుకు డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి నివాసానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు.
రూ.50లక్షలతో రోడ్డు పనులు పూర్తి చేయడం వలన ప్రయాణ సౌలభ్యం మెరుగు పడిందని మంత్రికి వివరించారు. హెఎండబ్యూస్ నిధుల నుంచి రూ.50లక్షల నిధులతో మంచి నీటి సమస్యను పరిష్కరించడంతో 300ల కుటుంబాలకు మేలు జరిగిందని మంత్రితో అన్నారు. కాలనీలో ఉన్న సమస్యల పరిష్కారానికి నరంతరం కృషి చేస్తున్న మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డికి ఎప్పుడు రుణ పడి ఉంటామన్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు విష్ణు వర్ధన్ రెడ్డి, కిషన్ నాయక్, ప్రవీణ్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రావు, అశ్విని, రామిడి జ్యోతి, రమా తదితరులు ఉన్నారు.