Drugs Case | టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 2017లో నమోదైన 8 కేసుల్లో ఆరు కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.
టాలీవుడ్లో డ్రగ్స్ కేసు అప్పట్లో కలకలం సృష్టించింది. ఈ కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపింది. ఈ క్రమంలో నెలల తరబడి టాలీవుడ్ నటులను విచారించిన ఎక్సైజ్ శాఖ.. ఎనిమిది కేసులను నమోదు చేసింది. నటీనటుల నుంచి గోళ్లు, వెంట్రుకల నమూనాలను తీసుకుంది. ఈ శాంపిల్స్‌ను ఎఫ్ఎస్ఎల్కు పంపించింది. ఈ క్రమంలో పూరీ జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్‌ను పరిశీలించిన ఎఫ్ఎస్ఎల్.. వాళ్ల శరీరంలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని తేల్చింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక, సాక్ష్యాలు చూసి 6 కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.