మాదాపూర్, సెప్టెంబర్ 20: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో దసరా షాపింగ్ బొనాంజా మొదటి లక్కీ డ్రా 2025ను అట్టహసంగా నిర్వహించారు. మాదాపూర్‌లోని బిగ్ సి మొబైల్ షోరూమ్‌లో శనివారం నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమానికి నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే మార్కెటింగ్ విభాగం అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు పీ రాములు, రాజిరెడ్డి, డిప్యూటీ మేనేజర్ సందీప్ జోషితో పాటు బిగ్ సి మార్కెటింగ్ ఏజీఎం యూసుఫ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా అతిథులు మొదటి డ్రాను తీశారు. అనంతరం నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే ఏజీఎం రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న దసరా బంపర్ డ్రాతో వినియోగారులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని వారి నుంచి విశేష స్పందన వస్తున్నట్లు చెప్పారు. గత 10 సంవత్సరాలుగా ఈ లక్కీ డ్రా తీస్తన్నామన్నారు. మొదటి బహుమతిగా 32 ఇంచెస్ టీవి, రెండవ బహుమతిగా మొబైల్ ఫోన్, మూడవ బహుమతిగా గిఫ్ట్ వోచర్, నాలుగవ బహుమతిగా గిఫ్ట్ హ్యాంపర్‌ను ఇవ్వడం జరుగుతుందన్నారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే డిప్యూటీ మేనేజర్ సందీప్ జోషి మాట్లాడుతూ… గత పదేండ్లుగా బిగ్సితో నమస్తే తెలంగాణ ఉండటం గొప్ప విషయమన్నారు. టైటిల్ స్పాన్సర్‌గా సీఎంఆర్ షాపింగ్ మాల్, మెయిన్ స్పాన్సర్‌గా అల్లకాస్, గిఫ్ట్ స్పాన్సర్‌గా బిగ్ సీ, పవర్డ్ బై అల్మోన్డ్ హౌజ్, ప్రొటీన్ పార్ట్నర్గా వెన్‌కాబ్ చికెన్, అసోసియేషన్ విత్.. హర్షా టొయోటా, కున్ హుందాయి, వరుణ్ మోటార్స్, మాలేపల్లి జ్యువెల్లర్స్, శ్రీ సిల్క్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెలివిజన్ పార్ట్నర్గా.. టీ న్యూస్, డిజిటల్ పార్ట్నర్గా.. సుమన్ టీవీ వ్యవహరిస్తున్నారు.
పదేళ్లుగా డ్రా నిర్వహిస్తున్నాం
గత 10 సంవత్సరాలుగా దసరా బొనాంజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. బిగ్ సీ, చందనా బ్రదర్స్, మానెపల్లి జ్యువెలర్స్, సీఎంఆర్ షాపింగ్ మాల్లో వినియోగదారులు కొనుగోలు చేసిన ఉత్పత్తులపై కూపన్లను అందుకున్నారు. ఇందులో భాగంగా అన్నింటిని కలిపి బిగ్ సి లో మొదటి లక్కీ డ్రా తీశాం. విజేతలకు శుభాకాంక్షలు.
– నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే ఏజీఎం రాములు
ప్రతి కొనుగోలుపై బహుమతులు
దసరా సందర్భంగా ప్రతి మొబైల్ కొనుగోలుపై 5 బెనిఫిట్స్ ఇస్తున్నాం. మొదటిది వాచ్, ఇయర్ బడ్స్‌తో పాటు మరిన్ని బెనిఫిట్స్‌ను అందిస్తున్నాం.లక్కీ డ్రాలో భాగంగా మొదటి విజేత ప్రతిభ (మానెపల్లి జ్యువెలర్స్‌లో షాపింగ్), 2వ బహుమతి ఎండీ యాసిన్ (చందనా బ్రదర్స్ షాపింగ్), 3వ బహుమతి ముస్తఫా, 4వ బహుమతి ఎ.సౌమ్య గెలుచుకున్నారు.
– యూసుఫ్, మార్కెటింగ్ ఏజీఎం , బిగ్ సి