EFLU | ఉస్మానియా యూనివర్సిటీ: ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) నూతన వైస్ ఛాన్స్లర్గా ప్రొఫెసర్ నాగలపల్లి నాగరాజు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విద్యా శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
నాగలపల్లి నాగరాజు ఈ పదవిలో ఐదేళ్లు కొనసాగనున్నారు. ఇంగ్లీష్ సాహిత్యం విభాగానికి చెందిన ఆయన ప్రస్తుతం ఒడిశాలోని గంగాధర్ మెహర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్గా సేవలు అందిస్తున్నారు. ఆయన సుదీర్ఘకాలం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో అధ్యాపకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.