Musi River | మరికాసేపట్లో మూసీ కూల్చివేతలు షురూ..
కూల్చివేతల విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తగ్గడంలేదు. మూసీ (Musi River) సుందరీకరణలో భాగంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు అధికారులు సిద్ధమయ్యారు.
హైదరాబాద్: కూల్చివేతల విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తగ్గడంలేదు. మూసీ (Musi River) సుందరీకరణలో భాగంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు అధికారులు సిద్ధమయ్యారు. మొదటి విడతలో పునరావాస కేంద్రాలకు తరలించిన వారి ఇండ్లను మరికాసేపట్లో నేలమట్టం చేయనున్నారు. ఇప్పటికే చాదర్‌ఘాల్‌లో రెడ్‌మార్క్ చేసిన ఇండ్లకు రెవెన్యూ అధికారులు సీల్ వేశారు. చాదర్‌ఘాట్ పరిసరాల్లో 20 ఇండ్లకు ఆర్బీ-ఎక్స్ మార్కింగ్ చేసి నిర్వాసితులను తరలించిన విషయం తెలిసిందే. మూసానగర్, రసూల్‌పుర, వినాయక్‌నగర్‌లో కూల్చివేతలు జరుగనున్నాయి.
లక్షన్నర ఇండ్లకు మార్కింగ్..
మూసీ డెవలప్మెంట్ అలైన్మెంట్ మ్యాప్ అందుబాటులోకి రాక ముందు… మూసీకి ఇరువైపులా రివర్ బెడ్ పరిధిలో ఉన్న నిర్మాణాల సంఖ్య దాదాపు 30 నుంచి 40వేల మధ్య ఉంటుందని భావించారు. కానీ ప్రస్తుత మ్యాప్ ప్రకారం రివర్ బెడ్(రెడ్ లైన్) పరిధిలో వచ్చే నిర్మాణాల సంఖ్య 60 నుంచి 70వేలకు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఎఫ్ఆర్ఎల్(బ్లూ లైన్) పరిధిలోకి వచ్చే ఆస్తుల సంఖ్య దాదాపు లక్షకు పైగానే ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఒక్కో చోట ఎఫ్ఆర్ఎల్ వెడల్పు 80 నుంచి 100 మీటర్ల దూరంలోనే ఉండగా… దీనికి అదనంగా బఫర్ జోన్ నిర్దారించాల్సి ఉంటుంది. మూసీ ప్రక్షాళన పేరిట ఈ లెక్కన ప్రభుత్వం దాదాపు లక్షన్నరకు పైగా నిర్మాణాలను సుందరీకరణ పేరిట మూసీలో ముంచేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
హద్దుల కోసం ప్రత్యేక మ్యాప్..
మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు మూడు నెలల్లోనే అంచనా వ్యయా న్ని రూ.లక్షన్నర కోట్లకు పెంచేసి.. మూసీ బ్యూటిఫికేషన్ కాంగ్రెస్‌కు ఏటీఎంలా మారనుందనే విమర్శలతో పౌర సమాజం గళమెత్తింది. దీనికోసం రెవె న్యూ, ఇరిగేషన్, జియో మ్యాపింగ్ అధ్యయన సంస్థలతో కలిసి మ్యాప్‌ను రూపొందించిందని ఎంఆర్డీసీఎల్ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

