సిటీబ్యూరో, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ) : ముషీరాబాద్‌లో ఎంతో ప్రసిద్ధి గాంచిన హెబ్రోన్ చర్చి వివాదానికి తెర పడిం ది. సొసైటీ, ట్రస్ట్ మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతూ వస్తుంది. ఈ క్రమం లో ఇరు వర్గాలు కోర్టు మెట్లెక్కడంతో సమస్యకు పరిష్కారం లభించినట్లుయింది. దీంతో హెబ్రోన్ చర్చి అడ్మినిస్ట్రేషన్, ఆరాధనకు సం బంధించి ఉన్న విషయాల్లో ఇరువర్గాల మధ్య కొనసాగుతున్న సమస్య తొలిగిపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం హెబ్రోన్ చర్చిలో క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ సాల్మన్ రాజు, కృపాధానం, సొసైటీ సభ్యులు బ్రదర్ కురియన్, పీటర్ చారితో పాటు ట్రస్ట్‌కు సంబంధించిన సభ్యులు ఎఫ్‌సీఎస్ పీటర్, కమిటీ సభ్యులతో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్‌సాగర్, బీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహాలు ప్రత్యేకంగా సమావేశమైయ్యారు.
మరోసారి చర్చి, అడ్మినిస్ట్రేషన్ల విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇరువురు కలిసిపోయి హెబ్రోన్ చర్చికి మంచి పేరు తేవాలని సూచించారు. సమాజంలో క్రైస్తవులకు మంచిపేరు ఉందని, ఆ పేరును నిలబెట్టుకునే విధంగా సమాజానికి మార్గదర్శకంగా ఉండాలని సూచించారు. ఈ సంఘా న్ని స్థాపించిన బ్రదర్ భక్తసింగ్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని కోరారు. చర్చికి సంబంధించి ఇతరుల జోక్యం లేకుండా సొసైటీ, ట్రస్ట్ సభ్యులు కలిసిమెలిసి ఉండాలని ఎమ్మెల్యే చెప్పారు.