మూసాపేట, అక్టోబర్ 6 : వివాహేతర సంబంధం కొనసాగుతుందన్న అనుమానంతో ఓ నిండు ప్రాణాన్ని బలికొన్న సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కైత్లాపూర్కు చెందిన శ్రీకాంత్‌యాదవ్ (26)పాల వ్యాపారి. ఈనెల 1న అతడు అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు పలువురిని అనుమానిస్తూ కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐడీఎల్ గ్రౌండ్లో శ్రీకాంత్ హత్యకు గురైనట్లు గుర్తించారు. ఈ హత్య వివాహేతర సంబంధం అనుమానంతో జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులు చిక్కితేనే వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.