జవహర్‌నగర్, సెప్టెంబర్ 11: అదృశ్యమైన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. జవహర్‌నగర్ సీఐ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం… అశోక్(36) సికింద్రాబాద్‌లోని ఓ హోటల్లో స్వీపర్‌గా పనిచేస్తున్న సమయంలో రాజమణితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇటీవల ఎల్లరెడ్డిగూడకు భార్యపిల్లలతో మకాం మార్చిన అశోక్.. అక్కడే రాజమణి కోసం మరో గదిని అద్దెకు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తితో సంబంధం కొనసాగిస్తుందని అనుమానించిన అశోక్.. 5న రాజమణితో గొడవపడి ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. మృతదేహాన్ని సంచిలో చుట్టి, డ్రమ్ములో వేసి ఆటోలో శామీర్‌పేటలోని లాల్‌గడి మలక్‌పేట్ అటవీ ప్రాంతానికి తరలించి పాతిపెట్టాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.