Shamshabad | శంషాబాద్ రూరల్/బండ్లగూడ, జూన్ 21 : శంషాబాద్ పట్టణంలోని పలు హోటళ్లలో శుక్రవారం మున్సిపల్ శానిటేషన్ అధికారి లక్ష్మయ్య ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. మార్క్ కిచెన్, శ్రీ వెంగమాంబ, వెంగమాంబ, స్వాగత్ గ్రాండ్ హోటళ్లలో పరిశుభ్రత లేకపోవడంతో పాటు చికెన్ ఇతర పదార్థాలు నాసిరకంగా ఉన్నట్లు గుర్తించి రూ. 12వేల జరిమానా విధించారు.
అలాగే బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ శరత్ చంద్ర జీషాన్ హోటల్లో తనిఖీ చేశారు. ఫ్రిడ్జిలో కుళ్లిన మాంసంతో పాటు పాయకు ఉపయోగించే మేక కాలు, చికెన్ వంటివి గుర్తించి..సీజ్ చేశారు. అనంతరం నిర్వాహకులకు 10 వేల రూపాయల జరిమానా విధించారు.