శంషాబాద్ రూరల్, ఆగస్టు 19 : దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి అన్నారు. గురువారం శంషాబాద్ మండలంలోని కవ్వగూడ గ్రామ సర్పంచ్ రమేశ్ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు చేవెళ్ల ఎంపీ ఇంటికి వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్ చిత్రపటానికి నాయకులతో కలిసి ఎంపీ క్షీరాభిషేకం చేశారు.కార్యక్రమంలో కవ్వగూడ గ్రామ టీఆర్ఎస్ నాయకులు అనిల్‌గౌడ్, సురేశ్ ముదిరాజ్,నాయకులు పాల్గొన్నారు.