బడంగ్‌పేట : నాడు ఉద్యమ నేతగా నేడు అభివృద్ధి ప్రధాతగా రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ముందుకెళ్తున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా బడంగ్‌పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేశారు.
హరిత హారంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రసిద్ధిగాంచిన పహాడీషరీప్ దర్గాలో చాదర్ కప్పి ప్రత్యేక పూజలు చేశారు. పాఠశాల విద్యార్థులకు, మున్సిపల్ కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సందచెరువు పై ఏర్పాటు చేసిన గౌతమ బుద్దుని విగ్రహన్ని మంత్రి ఆవిష్కరించారు. 30 మంది ఆశ వర్కర్లకు స్మార్ట్ పోన్లు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రంపంచంలో అతి ఎత్తైన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించి రైతన్నకు ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలన్న లక్ష్యంతో కేసీఆర్ పనిచేస్తున్నారని ఆమె అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకం త్వరలో పూర్తి అవుతుందన్నారు.
దేశానికి వెల్లువలా పెట్టుబడులు వస్తున్నాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్లు చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, దుర్గా దీప్లాల్ హన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్లు కృష్ణ మోహన్ రెడ్డి, నాగేశ్వర్ రావు, కార్పొరేటర్లు ఏనుగు రాంరెడ్డి, యాతం పవన్ కుమార్, పెద్ద బావి శ్రీనివాసరెడ్డి, పెద్ద బావి దర్శన్ రెడ్డి, బీమిడి స్వప్న జంగారెడ్డి తదితరులు ఉన్నారు.