కుత్బుల్లాపూర్ : బాచుపల్లి(Bachupalli) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. లక్ష్మి అనే మహిళ తన ఎనిమిది నెలలు, మూడేళ్ల వయస్సున్న ఇద్దరు చిన్నారులను ఇంటి ముందు సంపులో పడవేసి తను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి లక్ష్మిని గాంధీ హాస్పిటల్కు తరలించారు.
సంఘటన స్థలానిక చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. లక్ష్మి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.