హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా నార్సింగిలో(Narsingi) విషాదం చోటు చేసుకుంది. ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో తెలియదు కాని చావే శరణ్యమని భావించింది. నవ మాసాలు మోసి అల్లారు ముద్దుగా పెంచిన తన మూడేండ్ల కూతురుతో(Mother and daughter c) కలిసి అపార్ట్మెంట్(My Home Avatar apartment) పైనుంచి దూకి బలవన్మరణానికి (Committed suicide) పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. నార్సింగిలోని మై హోమ్ అవతార్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న మానస(30) అనే మహిళ తన కూతురు కృషా(3)తో కలిసి భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేపట్టారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, భర్తతో గొడవ పడి మానస ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మై హోమ్ అవతార్ అపార్ట్మెంట్లో తల్లి కూతురు ఆత్మహత్య.
నార్సింగి – మై హోమ్ అవతార్ అపార్ట్మెంట్ 18 ప్లోర్ నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి మానస, కూతురు కృషా.
భర్తతో గొడవ పడి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. pic.twitter.com/jIxakKGTzG
— Telugu Scribe (@TeluguScribe) September 29, 2024