సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): ఉపరితల ద్రోణి ప్రభావంతో మంగళవారం సాయంత్రం గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9గంటల వరకు నగరంలోని షేక్పేట్లో 1.18 సెం.మీ, ఆసిఫ్నగర్లో 1.15, రాజేంద్రనగర్లో 1.05 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రాగల 48 గంటల్లో గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.