ప్రవేశాల్లో ఆదర్శం

- మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్
- నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
- ఈ నెల 30 వరకు చివరి గడువు
- జూన్ 6న అర్హత పరీక్ష
- గ్రేటర్‌వ్యాప్తంగా 20 ఆదర్శ పాఠశాలలు
విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా వెనకబడిన మండలాల్లోని పేద, గ్రామీణ విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు కార్పొరేట్‌కు దీటుగా ఉచిత విద్యను అందించేందుకు మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాక విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, రెండు జతల యూనిఫాంలు, మధ్యాహ్న భోజన వసతిని కల్పిస్తూ వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తప్పిస్తున్నది. మోడల్ స్కూళ్లలో చదివే బాలికలకు మాత్రం హాస్టల్ వసతి కల్పిస్తున్నది. ఇదీగాక 6వ తరగతి విద్యార్థులకు పలు వృత్తి విద్యా కోర్సుల్లో తర్ఫీదు ఇస్తుండగా.. ఇంటర్ విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎంసెట్ తదితర పోటీ పరీక్షలకు నిపుణుల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నది. దీంతో ప్రతి సంవత్సరం వందలాది మంది విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారు. పలు పేరొందిన ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందుతున్నారు. తమ భవితకు బంగారు బాటలు వేసుకుంటున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 194 మండల కేంద్రాల్లో మోడల్ స్కూళ్లు ఉండగా, గ్రేటర్ పరిధిలో 20 స్కూళ్లు ఉన్నాయి. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరానికి (2021-22) మోడల్ స్కూళ్ల ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఏప్రిల్ 30లోగా దరఖాస్తులు స్వీకరించి.. జూన్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నారు.
అర్హతలు ఇవీ..
- మోడల్ స్కూళ్లలో ప్రవేశం పొందగోరే విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతం అయితే రూ.1.50 వేలు, పట్టణ ప్రాంతం అయితే రూ.2 లక్షలకు మించకూడదు.
- మోడల్ స్కూల్ ఉన్న మండలానికి చెందిన విద్యార్థి అయి ఉండాలి. లేదంటే కనీసం ఆ మండల పరిధిలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో రెండేండ్లు విద్యాభ్యాసం చేసి ఉండాలి.
- 6వ తరగతిలో ప్రవేశం పొందగోరే విద్యార్థి ఆగస్టు 31 నాటికి 10 ఏండ్లు, 7వ తరగతి ప్రవేశానికి 11 ఏండ్లు, 8వ తరగతికి 12 ఏండ్లు, 9వ తరగతికి 13 ఏండ్లు, 10వ తరగతికి 14 ఏండ్లు నిండి ఉండాలి.
ఎంపిక ఇలా..
- అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పిస్తారు.
- ప్రశ్నపత్రం తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.
- తెలుగు, గణితం, పర్యావరణ శాస్త్రం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ పాఠ్యాంశాల నుంచి 100 ప్రశ్నలకు ఐచ్ఛిక విధానంలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
- 6వ తరగతికి సంబంధించి ప్రతీ మోడల్ స్కూల్లో 100 సీట్లను భర్తీ చేస్తారు. అందులో జనరల్ కేటగిరికి 50 శాతం, ఎస్సీలకు 15, ఎస్టీలకు 6, బీసీలకు 29 శాతం సీట్లు, ఆ మొత్తం సీట్లలో బాలికలకు 33 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లను కేటాయించనున్నారు. ఇక 7 నుంచి 10వ తరగతులకు సంబంధించి ఆయా స్కూళ్లు, తరగతుల్లో ఉన్న ఖాళీల ఆధారంగా భర్తీ చేయనున్నారు.
షెడ్యూల్ ఇలా..
- ఏప్రిల్ 15 నుంచి 30 వరకు 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
- ఏప్రిల్ 20 నుంచి 30 వరకు 7నుంచి 10వ తరగతి వరకు
అప్లికేషన్ ఫీజు..
- జనరల్ అభ్యర్థులకు రూ.150
- ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.75
అర్హత పరీక్ష..
- 6వ తరగతి అభ్యర్థులకు జూన్ 6న..
- 7నుంచి ఆపై తరగతులకు జూన్ 5న..
- ఫలితాల ప్రకటన జూన్ 14
- మెరిట్ లిస్ట్ జూన్ 17
- సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ప్రవేశాలు జూన్ 18 నుంచి 20 వరకు
- తరగతుల ప్రారంభం జూన్ 21..
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

