సిటీబ్యూరో, అక్టోబరు 19(నమస్తే తెలంగాణ): ప్రపం చ వ్యాప్తంగా ఖ్యాతిని ఆర్జించిన సాలార్జంగ్ మ్యూజి యం విశేషాలు ఆడియో, వీడియో రూపంలోనూ అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్ అం దుబాటులో ఉన్న నేపథ్యంలో సాలార్జంగ్ మ్యూజియం నిర్వాహకులు, సందర్శకుల సౌకర్యార్థం కొత్తగా మొబైల్ యాప్ను రూపొదించారు. ఎలాంటి గైడ్ అవసరం లేకుం డా మ్యూజియంలోని అన్ని రకాల విశేషాలను ఆడియో రూపంలో వినేందుకు వీలుగా మొబైల్ యాప్ను సరికొత్తగా తీర్చిదిద్దారు. ఈ యాప్ను రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ మంగళవారం ఆవిష్కరించారు. గూగుల్ ప్లే స్టోర్లో సాలార్జంగ్ మ్యూజియం పేరుతో వెతికితే యాప్ వివరాలు వస్తాయి.
యాప్లో ప్రాథమికంగా ఫ్రీ ప్రివ్యూ టూర్ సమాచారా న్ని పూర్తిగా ఇంగ్లిషులో పొందుపర్చారు. ఇందులో పరిచ యం, ఫౌండర్స్ గ్యాలరీ, ఫోర్స్లైయిన్ వేస్, మస్నడ్, ఇండియన్ బ్రోంజ్ గ్యాలరీ, పార్వతి, నటరాజ, ఇండియ న్ స్కల్ప్చ్ర్స్ గ్యాలరీ, స్టాండింగ్ బుద్ధ, బోధి సత్త్వ, మైత్రే య వంటి అంశాల్లో 2-3 నిమిషాల వ్యవధితో కూడిన ఆడియోలు ఇందులో పొందుపరిచారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సాలార్జంగ్ మ్యూజియం గురిం చి స్మార్ట్ఫోన్లో మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా వినొచ్చు. అదే విధంగా నేరుగా సాలార్జంగ్ మ్యూజియానికి వచ్చిన ఆన్ ప్రిమిసెస్ పేరుతో మరో ఆప్షన్లో అక్కడి విశేషాలను గైడ్ అవసరం లేకుండా ఆడియో రూపంలో మాటలను వినేలా యాప్ను రూపొందించారు.