సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులను యుద్ద ప్రతిపాదికన పూర్తి చేయనున్నట్లు మలాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం తార్నాకలోని ఎంఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏవోసీ ప్రాజెక్టుకు రక్షణ శాఖకు చెందిన భూమికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5.78 ఎకరాల భూమి కేటాయింపు, శామీర్‌పేట్‌లోని ఎల్ఎల్ఆర్ ప్రాంతంలో 153 ఎకరాల భూమి బదిలీ అంశంపై కమిషనర్ సమగ్రంగా చర్చించారు.
ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని, మేడ్చల్-మలాజ్ గిరి జిల్లా కలెక్టర్‌కు వెంటనే లేఖ పంపాలని అధికారులను ఆదేశించారు. ఏవోసీ పనులు ప్రారంభించేందుకు అవసరమైన రైల్వే భూముల సేకరణ, భూసేకరణ విధానంపై అధికారులతో సవివరంగా చర్చించారు. ఎంఎంసీ నూతన భవన నిర్మాణానికి డీపీఆర్ కన్సల్టెంట్‌తో రెండు రోజుల్లో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. టీకేఆర్ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ప్రభావితమయ్యే మొత్తం ఆస్తులపై సమీక్ష నిర్వహించారు. తకువ ప్రభావం ఉండే ప్రత్యామ్నాయ మార్గాన్ని గుర్తిస్తూ, నిర్మాణాల స్వభావం ఆధారంగా జాబితా సిద్ధం చేయాలని సూచించారు.
సమావేశానికి హాజరైన ప్రభావిత భవనాల యజమానులతో కమిషనర్ చర్చించారు. వారిలో పలువురు టీడీఆర్ స్వీకరించేందుకు అంగీకరించి, అవసరమైన భవన భాగాన్ని అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. టీడీఆర్ స్వీకరించేందుకు ముందు కు వచ్చిన యజమానులకు ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్, చీఫ్ సిటీ ప్లానర్ ప్రదీప్‌తో కలిసి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. మొత్తం 34 మంది ఆస్తి యాజమానులు టీడీఆర్ స్వీకరించేందుకు అంగీకరించగా, వారికి త్వరలోనే టీడీఆర్ జారీ చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. సమావేశంలో జోనల్ కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్, సిటీ ప్లానర్లు తదితరులు పాల్గొన్నారు.