నందిగామ, జూలై 10 : సిద్ధాపూర్ గ్రామాన్ని మనమే రక్షించుకుందామని సిద్ధాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు ఎమ్మె సత్యనారాయణ అన్నారు. కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్లో డంపింగ్‌యార్డు ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల భూమిని కేటాయిస్తూ జీవో జారీ చేయడంతో సిద్ధాపూర్‌తోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తు న్నారు. అందులో భాగంగానే శుక్రవారం వైఎంతండా, పుల్లిచర్లకుంటతండాల్లో డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువ కులు గ్రామాల్లో భారీగా ర్యాలీ తీసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ..
సిద్ధాపూర్లో డంపింగ్‌యార్డు ఏర్పాటైతే మన భవిష్యత్ అంధకారంగా మారుతుందని.. ప్రతిరోజూ దుర్వాసనతో తీవ్ర ఇబ్బంది పడడంతోపాటు విపరీతమైన కాలుష్యంతో మనుషులతో పాటు జీవాలూ రోగాలబారిన పడే దయనీయమైన దుస్థితి నెలకొంటుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధాపూర్లో డంపింగ్‌యార్డు వద్దే..వద్దని.. అందుకోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దా మన్నారు. కాంగ్రెస్ నాయకులు డంపింగ్‌యార్డు రాదని ప్రజలను రాదని మభ్యపెట్టొద్దని సూచించారు. ఎవరూ ఎన్ని కుట్రలు చేసినా డంపింగ్‌యార్డు రద్దయ్యే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. నిరసనలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాలయ్య, వైఎంతండా మాజీ సర్పంచ్ అరుణారమేశ్నాయక్, ఉప సర్పంచ్ గణేశ్, నాయకులు నరేందర్‌రెడ్డి, బాబురాజ్, శంకర్, రామ్‌దాస్, గోపాల్, బిచ్చానాయక్, సంతోష్, భాస్కర్, జ్యోతి, పాండు, మల్లేశ్, మహేశ్, లక్ష్మయ్య, కృష్ణయ్య, తిరుపతి, గ్రామస్తులు పాల్గొన్నారు.
జవహర్‌నగర్, జూలై 10: తెలంగాణ ఉద్యమం తరహాలో డంపింగ్‌యార్డ్ ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని, డంపింగ్‌యార్డ్ ప్రాంతా ప్రజలంతా ఏకమై రాంకీ యాజమాన్యం ఆగడాలపై పోరాడుదామని డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ షేక్షావలి పిలుపునిచ్చారు. ప్రజల జీవన ప్రమాణాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న జవహర్‌నగర్ డంపింగ్‌యార్డ్ తొలగింపే లక్ష్యం గా ముందుకు సాగుతూ శుక్రవారం యా ప్రాల్లో సీఎంఎస్ జయక్క ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా షేక్ షావలి, ఉమామహేష్ హాజరై మాట్లాడుతూ చెత్తను జవహర్‌నగర్‌కే కాకుండా నలువైపులా ఉన్న డంపింగ్‌యార్డ్‌లకు తరలించి, డంపింగ్‌యార్డ్ రహిత సమాజాన్ని నిర్మించాలన్నారు.
డంపింగ్‌యార్డ్ పోరాటాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లి ప్రజల భాగస్వామ్యం తో డంపింగ్‌యార్డ్ ఎత్తివేసే వరకు ఉద్యమం ఆపబోమని, రాంకీ యాజమాన్యం నిబంధలు పాటించుకుండా ప్రజల ఆరోగ్యం దెద్బతీస్తుండ టం నేరమని, ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుని డంపింగ్‌యార్డ్‌ను మూసివేయించాలని డిమాండ్ చేశారు. నేటి లారీల బంద్ కార్యక్రమానికి ప్రజలంతా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం డంపింగ్‌యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ యాప్రాల్ ఛైర్మన్‌గా నర్సింహా, కన్వీనర్‌గా సాయికుమార్‌ను నియామించారు. ఈ కార్యక్రమంలో శంకర్, సునీత, చంద్రమౌలి, సావిత్రి, నర్సింహాగౌడ్, వెంకటాచారి, వేణు పాల్గొన్నారు.