చార్మినార్, డిసెంబర్ 14: నగరంతోపాటు శివారు ప్రాంతాలకు చెందిన రైతులు నేరుగా తమ ఉత్పత్తులను అమ్మకాలను చేపడుతున్న మీర్ అలం మండికి త్వరలోనే నూతన వైభవాన్ని తీసుకువస్తామని చార్మినార్ ఎమ్మెల్యే జుల్ఫీకర్ అలీ తెలిపారు. గురువారం ఆయన ఎమ్మెల్సీ రెహ్మాత్బేగ్, వ్యవసాయ అధికారులతో కలిసి మీర్ అలం మండిని సందర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిజాం పరిపాలన నుంచి నగరంలో కొనసాగుతున్న మీర్అలం మండిలో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు మరింత మెరుగైన వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పురాతనమైన షెడ్లను తొలగించి ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటున్నామని, గత ఏడాది కాలంగా కొనసాగుతన్న విస్తరణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు. వ్యవసాయ అధికారులు రైతులకు మరిన్ని సదుపాయాల కల్పన కోసం చర్యలు తీసుకుంటున్నామని, పాతనగరంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వంతో చర్చలు జరిపి వాటిని వాటిని సాకారం చేసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.