Harish Rao | మణికొండ, ఆగస్టు 12: ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మణికొండ మున్సిపాలటీ భారత రాష్ట్ర సమితి నాయకులు,కార్యకర్తలు సోమవారం ఎమ్మెల్యే హరీశ్‌రావును నానక్‌రామ్‌గూడ హైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని క్రిన్స్ టెర్మినస్ విల్లాలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే కాలంలో ప్రజల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఇప్పటి వరకు కార్యకర్తలకు సరైన గుర్తింపు లేకుండా పోయిన విషయాన్ని తెలుసుకోవడం జరిగిందన్నారు.
మణికొండ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభగళ్ల ధనరాజ్, ది సిటిజన్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, మణికొండ కౌన్సిలర్ ఆలస్యం నవీన్‌కుమార్, మహిళా అధ్యక్షురాలు రూపారెడ్డి, విజయలక్ష్మి, రేఖ, సీనియర్ నాయకులు ముతంగి లక్ష్మయ్య, అందె లక్ష్మణ్‌రావు, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, జై, బుద్దోల్ బాబు, దిలీప్, భాను, ఉపేంద్రనాథ్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, యాలాల కిరణ్, ఎర్రోళ్ల రమేశ్, వివాజీ, ఆరీఫ్, సయ్యద్ రఫీక్, ఎల్లస్వామి, సబిన్, అలి, అశోక్, కృపాకర్, మోనేశ్ పాల్గొన్నారు.