హైదరాబాద్ : ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం..ఓటును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament elections) భాగంగా వెస్ట్ మారేడ్ పల్లిలోని(Westmaredupalli) కస్తూర్బా గాంధీ గర్ల్స్ కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును విజ్ఞతతో ఆలోచించి వేయాలన్నారు. అన్ని విధాలుగా అండగా ఉండే వ్యక్తులనే ఎన్నుకోవాలని సూచించారు.