హైదరాబాద్ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి(Minister Uttam Kumar Reddy) మృతి పట్ల మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) సంతాపం తెలిపారు. కొండాపూర్ లోని ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి పురుషోత్తం రెడ్డి పార్ధీవ దేహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. కాగా, హైదరాబాద్ లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో ఈ రోజు పురుషోత్తం రెడ్డి అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు పురుషోత్తం రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వస్థలం ప్రస్తుత సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని తాటిపాముల పురుషోత్తంరెడ్డి మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది. పురుషోత్తంరెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు పలువురు గ్రామస్తులు హైదరాబాద్కు తరలివస్తున్నారు.