కంటోన్మెంట్, సెప్టెంబర్ 18 : క్రీడలు సమైక్యతకు స్ఫూర్తిగా నిలుస్తాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్(MLA Talasani) అన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా బెంగాలీ హ్యాండ్ మేడ్ జ్యూవెల్లరీ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం జింఖానా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫుట్ బాల్ టోర్నమెంట్‌కి(Football tournament) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన క్రీడాకారులను పరి చయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడా పోటీల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారంతా ఒకేచోట కలుసుకోవడం ఎంతో సంతోషదాయకం అన్నారు.
క్రీడలు మానసిక, శారీరక ఎదుగుదలకు తోడ్పడుతాయన్నారు. ప్రతి సంవత్సరం ఫుట్‌బాల్ పోటీలను నిర్వ హిస్తున్న నిర్వాహకులను అభినందించారు. అనంతరం విజేతలకు క్యాష్ ఫ్రైజ్‌తో పాటు మెమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కిరణ్మయి, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, కిశోర్, అసోసియేషన్ అధ్యక్షుడు సుమీర్ ఆల్ దార్, సభ్యులు పబ్బా ప్రకాష్, కాబూల్ హుస్సేన్, అబూ తాహెర్, మున్నా తదితరులు పాల్గొన్నారు.