హైదరాబాద్ : నూతన సంవత్సరం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(KTR)కు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani )నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్కు తలసాని పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగాహైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాగా, నూతన సంవత్సర వేడుకలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం నిర్వహించారు. వారితో కాసేపు ముచ్చటించిన కేటీఆర్.. అనంతరం కలిసి భోజనం చేశారు. కార్మికులతో సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు.