హైదరాబాద్ : అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్లనే ప్రజలకు అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మినిష్టర్ రోడ్లోని కాచిబౌలి, నల్లగుట్ట ప్రాంతాల్లో ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండ్లలోకి నీరు చేరి రాత్రంతా జాగారం చేసిన బస్తీల ప్రజలు అండగా ఉంటామన్నారు. అధైర్యపడొద్దని బాధితులకు ధైర్యం చెప్పారు.
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న నాలాల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉంది. ముఖ్యమంత్రి వద్దే మున్సిపల్ శాఖ ఉన్నప్పటికి ప్రయోజనం లేదన్నారు. నాలాల్లో పూడిక తొలగింపు విషయంలో సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు.