సికింద్రాబాద్,సెప్టెంబర్28: సీతాఫల్మండి మధురానగర్లోని బంగారు మైసమ్మ అమ్మవారు సందమాత అలంకారంలో భక్తులకు ఆదివారం దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రులలో భాగంగా ఆదివారం సందమాత అలంకారంలోని అమ్మ వారిని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ చైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే వెంట ఆలయ అధ్యక్షుడు బాల్ రెడ్డి, సభ్యులు ప్రకాష్, ధన శేఖర్, మహేష్, శ్రీకాంత్ రెడ్డి, బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు శైలేందర్, బాల్ రెడ్డి, కరాటే రాజు తదితరులు ఉన్నారు.