మారేడ్‌పల్లి/అడ్డగుట్ట/బొల్లారం, ఆగస్టు 30 : ప్రతి ఒక్కరూ అశ్రద్ధ వహించకుండా టీకా వేసుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అన్నారు. సోమవారం మోండా డివిజన్లోని రైల్‌నిలయం అంబేద్కర్‌నగర్ బస్తీలో నిర్వహించిన ఉచిత కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఎమ్మెల్యే జి. సాయన్న, స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….కంటోన్మెంట్‌లోని బస్తీలు, కాలనీల్లో నివాసం ఉండే ప్రతి ఒక్కరూ ముప్పు నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. కంటోన్మెంట్లో అన్ని బస్తీ, కాలనీల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
కరోనా నియంత్రణలో వ్యాక్సిన్ పాత్ర ఎంతో కీలకమని అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్న అన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తూ రెవెన్యూ అధికారులు, పార్టీశ్రేణులతో కలిసి ఆమె డివిజన్లోని పలు ప్రాంతాల్లో పాదయాత్ర, బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అందరికి వ్యాక్సిన్ వేయించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ లింగాని శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు సునీల్, రమేష్, పార్టీశ్రేణులు నక్కమధు, మనోహర్, శ్రీనివాస్ గౌడ్, పొన్నాల రాజు పాల్గొన్నారు.