హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలందరికీ అందేలా కృషి చేస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ ( MLA Prakash Goud ) అన్నారు. ప్రజాపాలన( Praja palana) కార్యక్రమంలో భాగంగా మణికొండ మున్సిపాలిటీ 15వ వార్డులో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా లబ్దిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను (Welfare Programmes) అందించేందుకు నిర్వహిస్తున్న ప్రజా పాలనను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేషన్ కార్డులు ( Ration Cards) లేని వారు సైతం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని అందేలా చూస్తానన్నారు.
అనంతరం మణికొండ పంచవటి కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. మణికొండ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ప్రజా పాలన కార్యక్రమం ముగిసిన తరువాత కాలనీలు, బస్తీలో పర్యటిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ కమిషనర్ ఫల్గుణ్కుమార్, వైస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్ బుదోళ్లు కావ్యశ్రీరాములు, వసంత్చౌహాన్, పద్మారావు, నవీన్‌కుమార్, శైలజ పాల్గొన్నారు.