శంషాబాద్, అక్టోబర్ 22: నియోజకవర్గంలో మరో సారి సమష్టి కృషితో టీఆర్ఎస్ విజయకేతనం ఎగిరేద్దామని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం శంషాబాద్ లోని ఎంఎంఆర్ గార్డెన్లో టీఆర్ఎస్ మున్సిపల్, మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమాశానికి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాబోయే ఎన్నికలకు పారీ ్టశ్రేణులకు దిశానిర్దేశం, నూతన కార్యవర్గాలకు మార్గదర్శకాలు, నవంబర్ 15న నిర్వహించనున్న విజయగర్జనపై సలహాలు, సూచనలు తెలిపారు. అంతకుముందు నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తన జీవితం నియోజకవర్గ ప్రజల కోసమేనని, వారి రుణం తీర్చుకోలేనిదని, మూడు సార్లు వరుస విజయాలను అందజేశారని గుర్తుచేశారు. ప్రజల దీవెనతోనే ఇంతటి గొప్పస్థాయికి ఎదిగానని అన్నారు. సీఎం కేసీఆర్ చారిత్రాత్మక, సాహసోపేత, బహుళప్రయోజనకరమైన 111 జీవో సడలింపునకు యోచిస్తున్నారని, అదే జరిగితే నియోజకవర్గానికి మంచి భవిష్యత్ ఉంటుందని తెలిపారు.
నియోజకవర్గ పరిధిలో ఎయిర్‌పోర్టు, హైవే, రైల్వే వంటి సదుపాయాలు, సంస్థలు ఉన్నందున ఎంతో అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని వివరించారు. పలువురు మాట్లాడుతూ పార్టీ బలోపేతంతో పాటు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ నాయకత్వాన్ని బలపరిచి 2023లో జరిగే ఎన్నికల దిశగా నడుం బిగించాలని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి వచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, మండల, మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షులు చంద్రారెడ్డి, వెంకటేశ్, జడ్పీటీసీ తన్వి, ఎంపీపీ జయమ్మ తదితరులు పాల్గొన్నారు.