అత్తాపూర్, సెప్టెంబర్ 12: ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. అత్తాపూర్ డివిజన్‌కు చెందిన ముఖ్యనాయకులు ఆదివారం ఆయనను కలిసి సమస్యలను విన్నవించారు. జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది తక్కువగా ఉండటంతో అన్ని కాలనీల్లో పారిశుధ్య పనులు సక్రమంగా కొనసాగడం లేదని తెలిపారు. పలు బస్తీల్లో సీసీ రోడ్ల సమస్య ఉందని, హైదర్‌గూడ సిరిమల్లెకాలనీలోని బాపుఘాట్ ప్రాంతంలో తాగునీటి పైప్లైన్లు లేకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. మూసీ కాలువ పొడవున రక్షణ గోడను ఏర్పాటు చేయాలని రక్షణ గోడ లేకపోవడంతో మూసీ చెత్తా చెదారానికి నిలయంగా మారుతుందని రాత్రి వేళలో దూర ప్రాంతాల నుంచి మట్టిని చ్తెతను తీసుకువచ్చి డంపింగ్ చేస్తున్నారని వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ త్వరలో బస్తీల్లో తిరిగి సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు. మూసీ పరిరక్షణకు అధికారులతో మాట్లాడి రక్షణ గోడను నిర్మించేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు మిద్దెల సురేందర్‌రెడ్డి, చెరకు అమరేందర్, అత్తాపూర్ డివిజన్ అధ్యక్షుడు వనం శ్రీరాంరెడ్డి, టీఆర్ఎస్వీ గ్రేటర్ కోఆర్డినేటర్ శ్రీధర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ వార్డు కమిటీ సభ్యులు సురేశ్‌రెడ్డి, మహేశ్, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, సత్యరాయణగౌడ్, సంతోష్ పాల్గొన్నారు.