శంషాబాద్ రూరల్, ఆగస్టు 20 : పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీలు కీలకమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని సుల్తాన్‌పల్లి, కాచారం, రామన్నగూడ, మదన్‌పల్లి పాతతండా, మదన్‌పల్లి కొత్తతండా, జూకల్ గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీలను మండల పార్టీ అధ్యక్షుడు కె.చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అనంతరం ఆయా గ్రామ కమిటీల సభ్యులు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు. సుల్తాన్‌పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎల్గిని కుమార్‌గౌడ్, కాచారం గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కిశోర్‌యాదవ్, రామన్నగూడ అధ్యక్షుడిగా యాదయ్య, జూకల్ అధ్యక్షుడిగా లింగంగౌడ్, మదన్‌పల్లి కొత్తతండా అధ్యక్షుడిగా బాబునాయక్లను ఎంపిక చేసినట్లు మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీల సభ్యులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మంచర్ల మోహన్‌రావు, వైస్ ఎంపీపీ నీలంనాయక్, నీరటిరాజు ముదిరాజ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దండు ఇస్తారి, సర్పంచ్‌లు దేవానాయక్, రవినాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ బాల్‌రాజ్‌గౌడ్, వార్డు సభ్యులు చంద్రశేఖర్, మాలకృష్ణ, వీరాచారి, నాయకులు సుధాకర్‌గౌడ్, మల్లికార్జున్, వీరేశం, పాండురంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.