శంషాబాద్ రూరల్, ఆగస్టు 18 : ప్రభుత్వ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. శంషాబాద్ మండలంలోని హమిదుల్లానగర్ గ్రామానికి చెందిన మల్లేశ్‌కు 25,000, మంజులకు 25,000 రూపాయల సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను ఎమ్మె ల్యే బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్‌ఫండ్ ద్వారా ప్రభుత్వం పేద ప్రజలకు ఆరోగ్య భద్రతను కల్పిస్తున్నదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సతీశ్ యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ దవాణాకర్గౌడ్ పాల్గొన్నారు.
మండలంలోని రషీద్‌గూడ టీఆర్ఎస్ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులు సర్పంచ్ మంచాల రాణి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌ను బుధవారం కలిసి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమం లో పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మంచర్ల మోహన్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ దవాణాకర్గౌడ్, నాయకులు మంచాల సుధాకర్ పాల్గొన్నారు. రషీద్‌గూడ టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిగా మంచాల రవి, ప్రధాన కార్యదర్శిగా ధన్‌పాల్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా మంచర్ల బాల్‌రాజ్, ఖాజాపాషా, సహాయ కార్యదర్శులుగా సత్తయ్య, శ్రీకాంత్‌రెడ్డి ఎన్నికయ్యారు.
మైలార్‌దేవ్‌పల్లి,ఆగస్టు 18 : దొరల గుండెల్లో నిద్రలేకుండా చేసిన మహా యోధుడు సర్వాయి పాపన్న అని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. బుధవారం సర్వాయి పాపన్న 176వ జయంతి సందర్భంగా మైలార్‌దేవ్‌పల్లి లోని తన నివాసంలో పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ.. సబ్బండ వర్గాలతో కలిసి రాజ్యాధికారం సంపాదిం చి గోల్కొండ కోటకు రాజయ్యాడని చెప్పారు. వీరత్వం లో శివాజీకి ఏ మాత్రం తీసిపోని వీర యోధుడని అన్నా రు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్‌దాస్‌గౌడ్, సుభాశ్‌రెడ్డి, సుధాకర్‌గౌడ్, వెంకటేశ్‌గౌడ్ ఉన్నారు.