సికింద్రాబాద్, మార్చి 27: శ్రీరాముడి జీవితం ఆదర్శప్రాయం అని సికింద్రాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావుగౌడ్ అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని సీతాఫల్మండి, నామాలగుండు తదితర ప్రాంతాలలో సీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషులు సన్మార్గంలో జీవించాల్సిన తీరుతెన్నులను శ్రీరాముడు చాటి చెప్పారన్నారు. ఆయన ఆశీస్సులు అందరికి ఉండాలని పద్మారావుగౌడ్ ఆకాంక్షించారు.
ప్రజలు ఎంతో భక్తిశ్రద్దలతో శ్రీసీతారాముల వివాహమహోత్సవాన్ని కన్నుల పండువుగా జరుపుకుంటారని, వివాహ వ్యవస్థను ఆచారయోగ్యంగా ప్రపంచ దేశాలే గుర్తించాయని కొనియడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువనేత రామేశ్వర్గౌడ్ ఇతర నాయకులు పాల్గొన్నారు.