గౌతంనగర్, డిసెంబర్ 17: ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసమే కృష్ణానగర్‌లో రూ.1.25 కోట్ల నిధులతో బాక్స్డ్రైన్ నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా చిన్నపాటి వర్షాలకు మౌలాలి కృష్ణానగర్ వరద ముంపునకు గురువుతుంది. ఈ నేపథ్యంలో కాలనీవాసుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రత్యేక దృష్టి సారించి నిధులను మంజూరు చేయించారు.
శనివారం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బాక్స్డ్రైన్ పనులను ప్రారంభించారు. దీంతో వరద ముంపు నుంచి తమ కాలనీ విముక్తి అవుతుందని స్ధానికులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే బాక్స్డ్రైన్కు అనుసంధానంగా ఉన్న వీధుల నుంచి బాక్స్డ్రైన్లోకి వర్షపు నీరు వస్తుందని ఎమ్మెలే, డీఈ మహేశ్ స్థానికులకు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడుతూ.. మౌలాలి డివిజన్లో రూ.13కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు నడుస్తున్నాయని తెలిపారు. బాక్స్ డ్రైన్ కోసం తవ్వినప్పుడు వాటర్ సరఫరా పైపులు, డ్రైనేజీ పైపులు పగులుతాయని వెంటనే మరమ్మతులు చేస్తారని ఈ విషయంలో కాంట్రక్టర్కు సహాకారం అం దించాలని ఎమ్మెల్యే కోరారు. డ్రైన్ పనులు పూర్తి అయిన తరువాత సీసీ రోడ్లు వేస్తామని అన్నారు. రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ పోల్‌ను తొలగించాలని విద్యుత్ అధికారును కోరారు.
ఈ కార్యక్రమంలో డీఈ మహేశ్, కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు జీఎన్వీ.సతీశ్‌కుమార్, గుండా నిరంజన్, అమీనొద్దీన్, ఎం.భాగ్యనందరావు, సత్తయ్య, ఇబ్రహీం, ఫైజర్, నవాబ్, సమీర్, హజార్, ఇర్ఫాన్, ఆదినారాయణ, చందు, మోహన్‌రెడ్డి, సంతోశ్ రాందాస్, సంపత్, గౌలికార్ శైలేందర్, గౌలికార్ దినేష్, షకీల్, మైమూదాబేగం, జాన్‌బీ, కాశీంబీ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం: ఎమ్మెల్యే మైనంపల్లి
మల్కాజిగిరి, డిసెంబర్ 17: ప్రజల అవసరాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ తాళ్లబస్తీలో రూ.40లక్షలతో, సరస్వతినగర్‌లో రూ.15లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణపనులకు కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు శంకుస్థాపన చేశారు. అలాగే మల్కాజిగిరి డివిజన్ నర్సింహారెడ్డి నగర్లో రూ.1.20 కోట్ల వ్యయంతో బాక్స్డ్రైన్ నిర్మాణపనులకు కార్పొరేటర్ శ్రవణ్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే మైనంపల్లి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడుతూ .. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో వరదముంపు రాకుండా బాక్స్ డ్రైన్లను నిర్మిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈలు లౌక్య, మహేశ్, ఏఈ శ్రీకాంత్, కార్పొరేటర్లు ప్రేమ్‌కుమార్, శ్రావణ్‌కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, అధికార ప్రతినిధి జీఎన్వీ సతీశ్‌కుమార్, మీడియా కన్వీనర్ గుండా నిరంజన్, రాముయాదవ్, సంపత్‌రావు, సంతోశ్రాందాస్, మోహన్‌రెడ్డి, వైశాలి పాల్గొన్నారు.