ముషీరాబాద్/చిక్కడపల్లి, జనవరి 7 : నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదారాబాద్ సెంట్రల్ వార్షికోత్సవం శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠాగోపాల్ మాట్లాడుతూ.. ఉరుకుల పరుగుల జీవితంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ్ద తీసుకోవడం లేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే వ్యా యాయం, నడకను అలవాటుగా చేసుకోవాలని అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పార్కులను అభివృద్ధి చేస్తున్నదని తెలిపారు.
నియోజకవర్గంలోని సుందరయ్య పార్కుతో పాటు అనేక పార్కులను అభివృద్ధి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ అధ్యక్షుడు రవీందర్, బీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహ, స్థానిక కార్పొరేటర్ రవిచారి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెంకట కృష్ణ, బీజేవైఎం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భరత్‌గౌడ్, క్లబ్ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, కార్యదర్శి నిరంజన్, కోశాధికారి సునీల్‌కుమార్, ఉపాధ్యక్షుడిగా ఆర్. సంతోష్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు ఎం.దామోదర్‌రెడ్డి, పాం డయ్య, నాగభూషణం, హౌస్‌ఫెడ్ డైరెక్టర్ ఎ.కిషన్‌రావు, వైస్ ప్రెసిడెంట్ ఎం.ఎన్. రావు తదితరు లు పాల్గొన్నారు.
అడిక్‌మెట్ డివిజన్ నల్లకుంట ప్రభుత్వ పాఠశాలో శనివారం నిర్వహించిన సం క్రాంతి ముగ్గుల పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థినులు వేసిన ముగ్గులు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా నిలిచాయి. సంక్రాంతి విశిష్టతను చాటేలా తీరొక్క ముగ్గులు వేసి ఔరా అనిపించారు. బీఆర్ఎస్ పార్టీ అడిక్‌మెట్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కె. సురేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని ముగ్గుల పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, అనూరాధ, మాధవి, భాగ్యలక్ష్మి, సత్యవేణి, ముచ్చకుర్తి ప్రభాకర్, జెల్ల భిక్షపతి, ఖలీల్ పాల్గొన్నారు.
గంగపుత్ర చైతన్య సమితి ఆధ్వర్యంలో గంగపుత్ర జాతిపిత సందిరి బాలయ్య గంగపుత్ర 56వ వర్ధంతి, సమితి క్యాలెండర్ ఆవిష్కరణ శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శంకర్, నర్సింగ్ ,శ్రీనివాస్, సురేశ్, దీపిక, రవి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.