కవాడిగూడ, మార్చి 13: బతుకమ్మ విశిష్ఠతను ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత తెలంగాణ ఆడపడుచు కవితక్కకే దక్కిందని ముషీరాబాద్ ఎమ్మెల్కే ముఠా గోపాల్ (Muta Gopal) అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం భారత జాగృతి నాయకులు లవకుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను కవాడిగూడ బండమైసమ్మనగర్ కమ్యూనిటీహాల్‌లోని అంగన్వాడి కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ముఠాగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై యువనాయకుడు ముఠా జయసింహతో కలసి కేక్ కట్‌చేసి అంగన్వాడీ చిన్నారులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు విశేషమైన కృషి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ మహిళా లోకానికి కవితక్క ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వల్లాల శ్రీనివాస్‌యాదవ్, రామ్‌చందర్, ప్రభాకర్, మేకల శ్రీనివాస్, మహేష్, సంతోష్, సూరి, రమణ, రాములు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
గాంధీనగర్‌లో…
గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు ముడారపు రాకేష్‌కుమార్ ఆద్వర్యంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను లలితా పరమేశ్వరీ దేవి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముఠా నరేష్ ఆధ్వర్యంలో సహారా బేకరీ వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్‌చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పోతుల శ్రీకాంత్, పున్న సత్యనారాయణ, ఆకుల శ్రీనివాస్, ముచ్చకుర్తి ప్రభాకర్, శ్రీనివాస్‌గుప్తా, పాశంరవి, జి.యాదగిరి, శ్రీధర్‌రెడ్డి, రాజ్‌కుమార్, చాణక్యరెడ్డి, మహిళా నాయకులు అరుణ, శివకుమారి తదితరులు పాల్గొన్నారు.