మల్కాజిగిరి, సెప్టెంబర్ 12 : ప్రజల కోసం చేపడుతున్న అభివృద్ధి పనులకు రైల్వే శాఖ (Railway department) సహకరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri )అన్నారు. గురువారం రైల్వే శాఖ ఆర్పీఎఫ్ కమాండెంట్ రాంజీలాల్ తోమర్‌తో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ షిరిడీనగర్, కల్యాణ్‌నగర్ కాలనీలలోనికి రైల్వే శాఖ ఆర్పీఎఫ్ మైదానం నుంచి వస్తున్న వరద నీరు(Food water) కాలనీలను ముంచెత్తుతున్న వివరాలను ఆయనకు తెలిపారు
. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. రైల్వే స్థలం నుంచి వస్తున్న వరద నీటిని మళ్లించడానికి అధికారులతో సర్వే చేయించి సమస్యను పరిష్కరించేలా చేస్తామన్నారు. రైల్వే శాఖ సైతం వారు పనులకు సహకరిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. మరోసారి రైల్వే శాఖ అధికారులతో పాటు మున్సి పల్ ఇంజినీరింగ్ అధికారులు చర్చించుకొని సమన్వయంతో వరదముంపు సమస్యను పరిష్కరిం చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ లక్ష్మణ్, ఏఈలు లౌక్య, శ్రీకాంత్, వాటర్ వర్క్స్ మేనేజర్ నీవన్, తదితరులు పాల్గొన్నారు.