మల్కాజిగిరి, మే 5: మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జోన్ జాయింట్ కమిషనర్ డాకు నాయక్‌కు ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేరేడ్మెట్ డివిజన్లోని స్వర్ణాంధ్ర కాలనీ, గోల్ఫ్ ప్రైడ్లలో డ్రైనేజ్ అవుట్లెట్ సమస్యను పరిష్కరించాలని అన్నారు.
బాక్స్ డ్రైన్ నిర్మాణం, భరణి కాలనీ శ్మశానవాటిక కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని, మధురానగర్ మెయిన్ రోడ్డు నుంచి రేణుకనగర్ వరకు బాక్స్డ్రైన్ నిర్మాణం చేపట్టాలని అన్నారు. వినాయకనగర్ డివిజన్లోని ముస్లిం శ్మశానవాటికలో ఉన్న రాతి శిలలను తొలగించాలని, నీటిపారుదల శాఖకు సంబంధించి నాలాలు, చెరువుల అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ శ్రీనివాస్, టీపీఎస్ సంగీత, డీఈ పద్మలత, ఆర్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ అనిల్, ఎలక్ట్రికల్ ఏఈ ప్రసన్న, ఎంటమాలజీ దుర్గాప్రసాద్, వెటర్నరీ సద్గుణ, ఇరిగేషన్ డీఈ శుక్లజ, ఏఈ సుధీర్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రావుల అంజయ్య, జీకే హనుమంతరావు, అమీనుద్దీన్, మధుసూదన్ రెడ్డి, శివకుమార్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, భాగ్యనంద్, ఇబ్రహీం, వంశీ, రాజశేఖర్ రెడ్డి, సంతోష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.