మేడ్చల్, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ): మల్కాజిగిరిలో తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘానికి స్థలం కేటాయించాలని అసెంబ్లీలో రంగారెడ్డి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబుకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆదివారం వినతి పత్రం సమర్పించారు. నియోజకవర్గంలో బ్రాహ్మణ కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్న నేపథ్యంలో వివాహలు, కర్మకాండలు ఇతర సామాజిక కార్యక్రమాల నిర్వహణ కోసం బ్రాహ్మణ కమ్యూనిటీ బ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ భవవం అవసరమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. పేద బ్రాహ్మణులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని, ఒకే స్థలంలో వీరి అవసరాలను తీర్చే సదుపాయాన్ని కల్పించాలన్నారు.
అలాగే మల్కాజిగిరి నియోజకవర్గానికి సంబంధించిన వివిధ అభివృద్ధి పనులు, భూ కేటాయింపులు ప్రజాఅవసరాల గురించి వినతి పత్రాన్ని మంత్రికి మర్రి రాజశేఖర్‌రెడ్డి అందజేశారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన సమస్యలపై మంత్రి శ్రీధర్‌బాబు జిల్లా కలెక్టర్‌కు సమస్యలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.